Monday, December 3, 2007

ఒక హృధయం...

నిన్ను చేరాలని
నిన్ను చూడాలని
నీతో మట్లాడాలని
సముద్రపు అలల ఒడిలో నీతో ఆటలాడాల
నిఇసుక తిన్నెలపై నీ అడుగులో నా అడుగు వేస్తూ సాగిపోవాలని
చిలిపి చేష్టలు చేసి నీతో పొట్లాడాలని
అలసిన సమయంలో నీ ఒడిలో సేదతీరాలని
కాంక్షిస్తూ.... ఆకాంక్షిస్తూ...... వేచిన ఒక హృదయం .



కార్యోన్ముఖి...

నీవు పొందిన మహొన్నత జన్మం వీడివీడని మధ్యస్థ మర్మం
ప్రారంభించు చేదించుటకు తక్షణం

నయనాలను చేరిన స్వప్నం కావలి నయనానందం
కాన సాఫల్యం చేకూర్చు నయనములను వీడకనే
మరువాక్యం లేని వచనాలు పలుకు వంచించకనే
సాధనమున సాధించు గతించక క్షణం

నివురుగప్పిన సత్యం దహించునని భీతిచెందక
నివురుని తొలగించి వెలువరించిన నిను రక్షించు అను నిత్యం
శరములెన్నున్నగాని ఎదురు నిలువు, త్యజించి భయం
అనువైన త్యజించు తనువు,లోక ఉపయుక్తమైనక్షణం
మరుభూమికైనకేగు రక్షించుటకు ధర్మం
మరు జన్మనైన పోరాడు చేరుటకు నీ గమ్యం
ఇరుజన్మలైన గాని పలుజన్మలైనగాని
సార్దకత లేని జన్మం సౄజియుంచుట కన్న
త్యజించుట మిన్న.

ఉషోదయపు వేళ......

నిసబ్ధ చింతామణి నాట్యమాడువేళ, అడవి కూనలు ఆటలాడు వేళ
హిమగిరి నందుని హృధయం ద్రవించిన వేళ
అడవి మైనం మధురమైన గానముతో నిశబ్ధ చింతామణి బిత్తరపోయి చూచువేళ

అడవివిధ పక్షుల కిలవారాలు సంగీతముగా శ్రుతి పలికించు వేళ
జాజి తోటలోని జాబిలి జాముగా పరులిడిన వేళ
ఏకదిక్కున ఏకవ్రతుడు రుధిరవర్ణముతో జనియించు వేళ
హిమనీ నదాలు నాకు ఎదురెవ్వరంచు ఎచటికో ఏకరువు పెట్టువెళ
అడవి పుష్పాల వలన వింటి జామరులు మధుర సువాసనలు మోసుకెళ్ళెడి వేళ
ఈ ఉషొదయపు వేళ

అడవిలోన లేడికూనా ! మీనం వలచిన కనులదాన
నెమలి వంటి నదకదాన నడకలోనె నట్యమాడ
నీ నడక చూచి జాజి మల్లె నీ పాదములను శృశించ కోరె
పిల్లతెమ్మెర నీ వింటి ముంగురులను నింగిలోకి విహరింధమనుచు మిన్నగులవలె నాట్యమాడించు వేళ, అదేమిభాగ్యమో!
మనసుతో పలకించితో, హృధయంతో ఆలకించితో ఒకపర్యాయము
వెనుదిరిగి చూచితి అది మాయో ప్రకృతి విధియో
కలకంటి రెప్పవేయలేదే జర పాదములు జరపలేదే కర్ణబేరులకు తాకుచున్న కరకర ధ్వనులు వినికిడికి రాలేదె శిలనైతినో లేక నిర్జెష్టుడనైతినినో
రక్షక భటులు లాఘవముగా లాగి ఒక్కటిచ్చిన తెలియలేదె
కాని నా కనులు పండినవేమో లేక నా సుకృతమో!
సప్తస్వరాలు కలిపి పలికించిన ఆ మధుర మందహాస సవ్వడి
చిట్టి గువ్వలు పలికించే మువ్వడి
నా హృదయం ననువీడి నాకు దూరంగా పోవుచున్నది
ఆ ఘడియలోనే!
నాతనువు నన్ను మేలుకొలిపింది

కర్కశ భటులకు ద్విపక్షాలకు ఇచ్చే భత్యము చాలలేదేమో!
నూరు రూపాయలు జొడించుకొని పొమ్మంటిరి.

నా కాంక్ష......

భవత్సకుండు చంద్రబింబము పోలినవాడు
నడయాడిన అందములో సాటిపోటి లేడెవ్వడు
చూఛునంతనే పాషాణులైన ఆకర్షితులగుదురు
ధరిత్రిపైనిల్చుని ఏక కాలమున లోకమంతటిని శాశించువాడు
పద్మములపై నడయాడువాడు సమయమున

ఉక్కు ఖడ్గముపై నాట్యము చేయుధీరుడు వాడు చిరుమందహాసముతో చంద్రబింబమునే చలికి వణికించువాడు సమయమున

నడినెత్తిన సూర్యుని భగ్గున మండించువాడు
అతని కరములు లేతచిగురులే చూచి నంతనే
భ్రమపడుదురు పశికూనయా! అనినంతనే

కరములెత్తి కాకతాళియముగా పాషాణమునే పిండిచేసెనే
అతని చూచిన ఏమిఎరుగని లౌకిక అజ్ఙాని సమయమున
అతని అక్షులే వీక్షించు విశ్వమంతయు
కోటిమంది చాలరే పోటిపడి భంగపడనేల
ఎదురు నిలువలేరె ఎదురుపడి నడయాడుటేల
వాడిని ఎదురించి నిలువగలవాడెవ్వడు లేడె
అతడు అమాయకుడు అంతనే ఉద్రేకపరుడు
లోకమును జయించువాడు జనియించువాడు లోకబాంధవుడు వాడే ప్రతి భారతీయ పౌరుడు కావాలి.......

నా పిలగా.....

చెట్టు నీడనైనా కాకపోతినే ఓ పిలగా!
ఆకలిభాధను తాళలేక భానుప్రతాపానికి అలసిననాడు సేదతీర్చడానికి.
పిడికిలి మెతుకులనైనా కాకపోతినే ఓ పిలగా!
క్షుద్భాదతాళలేక కుళాయి నీరుతాగు నాడు.

జడివాననైనా కాకపోతినే ఓ పిలగా!
నీ దాహార్తినైనా తీర్చడానికి.

గొడుగునైనా కాకపోతినే ఓ పిలగా!
వరుణుడిప్రతాపానికి తాళలేక వణికిననాడు.

గుడ్డపీలికినైనా కాకపోతినే ఓ పిలగా!
అచ్ఛాదనం లేక తిరుగాడు నీతనువును దాచేందుకు.

చెప్పునైనా కాకపోతినే ఓ పిలగా!
ముళ్ళురాళ్ళ దెబ్బలకు పాదాలు నడవనీయనినాడు.

కవచమైనా కాకపోతినే ఓ పిలగా!
దొరగాని కొరడాదెబ్బలకు తాళలేక సృహతప్పిననాడు.

గూటినైనా కాకఫొతినే ఓ పిలగా!
అలసిన తనువు గువ్వోలె నిద్దరోయేందుకు.

తల్లినైనా కాకపోతినె ఒ పిలగా!
జోలపాడి నిద్దురపుచ్చేటందుకు.

తండ్రినైనా కాకపోతినే ఓ పిలగా!
మరుబాధలు మరిపించి ఓదార్చేటందుకు.

గురువునైనా కాకపోతినే ఓ పిలగా!
నిను భరత ఉజ్వల జ్యోతిగా తీర్చిదిద్దేందుకు.

చెలికాడనైనా కాకపోతినే ఓ పిలగా!
నీ భాదలను పంచుకుని ఓదార్చేటందుకు.

పలకనైనా కాకపోతినే ఓ పిలగా!
అక్షరాలు దిద్దించి విధ్యాదికుడిని చేసేందుకు.

ఒక్కగడియనైనా కాకపోతినె ఓ పిలగా!
నిను ఈ జన్మనుండి తప్పించేటందుకు.

కాని... ఇన్నికానందుకు నేను ఓ పిలగా!
పాషాణమైనా కాకపోతిని.

నీవు అనాదవైనావా ఓ పిలగా!
ఈ అనాధలోకంలో జన్మనిచ్చేటందుకు ఒక్కగడియైనా ఆలోచించక
కుప్పతొట్టి పాల్జేసిన ఆ కాటిన్యహౄదయాల పాపం అది.
కాని కావాలిరా! నీవు దేశానికి దీపం.