నీవు పొందిన మహొన్నత జన్మం వీడివీడని మధ్యస్థ మర్మం
ప్రారంభించు చేదించుటకు తక్షణం
నయనాలను చేరిన స్వప్నం కావలి నయనానందం
కాన సాఫల్యం చేకూర్చు నయనములను వీడకనే
మరువాక్యం లేని వచనాలు పలుకు వంచించకనే
సాధనమున సాధించు గతించక క్షణం
నివురుగప్పిన సత్యం దహించునని భీతిచెందక
నివురుని తొలగించి వెలువరించిన నిను రక్షించు అను నిత్యం
శరములెన్నున్నగాని ఎదురు నిలువు, త్యజించి భయం
అనువైన త్యజించు తనువు,లోక ఉపయుక్తమైనక్షణం
మరుభూమికైనకేగు రక్షించుటకు ధర్మం
మరు జన్మనైన పోరాడు చేరుటకు నీ గమ్యం
ఇరుజన్మలైన గాని పలుజన్మలైనగాని
సార్దకత లేని జన్మం సౄజియుంచుట కన్న
త్యజించుట మిన్న.
No comments:
Post a Comment