చెట్టు నీడనైనా కాకపోతినే ఓ పిలగా!
ఆకలిభాధను తాళలేక భానుప్రతాపానికి అలసిననాడు సేదతీర్చడానికి.
పిడికిలి మెతుకులనైనా కాకపోతినే ఓ పిలగా!
క్షుద్భాదతాళలేక కుళాయి నీరుతాగు నాడు.
జడివాననైనా కాకపోతినే ఓ పిలగా!
నీ దాహార్తినైనా తీర్చడానికి.
గొడుగునైనా కాకపోతినే ఓ పిలగా!
వరుణుడిప్రతాపానికి తాళలేక వణికిననాడు.
గుడ్డపీలికినైనా కాకపోతినే ఓ పిలగా!
అచ్ఛాదనం లేక తిరుగాడు నీతనువును దాచేందుకు.
చెప్పునైనా కాకపోతినే ఓ పిలగా!
ముళ్ళురాళ్ళ దెబ్బలకు పాదాలు నడవనీయనినాడు.
కవచమైనా కాకపోతినే ఓ పిలగా!
దొరగాని కొరడాదెబ్బలకు తాళలేక సృహతప్పిననాడు.
గూటినైనా కాకఫొతినే ఓ పిలగా!
అలసిన తనువు గువ్వోలె నిద్దరోయేందుకు.
తల్లినైనా కాకపోతినె ఒ పిలగా!
జోలపాడి నిద్దురపుచ్చేటందుకు.
తండ్రినైనా కాకపోతినే ఓ పిలగా!
మరుబాధలు మరిపించి ఓదార్చేటందుకు.
గురువునైనా కాకపోతినే ఓ పిలగా!
నిను భరత ఉజ్వల జ్యోతిగా తీర్చిదిద్దేందుకు.
చెలికాడనైనా కాకపోతినే ఓ పిలగా!
నీ భాదలను పంచుకుని ఓదార్చేటందుకు.
పలకనైనా కాకపోతినే ఓ పిలగా!
అక్షరాలు దిద్దించి విధ్యాదికుడిని చేసేందుకు.
ఒక్కగడియనైనా కాకపోతినె ఓ పిలగా!
నిను ఈ జన్మనుండి తప్పించేటందుకు.
కాని... ఇన్నికానందుకు నేను ఓ పిలగా!
పాషాణమైనా కాకపోతిని.
నీవు అనాదవైనావా ఓ పిలగా!
ఈ అనాధలోకంలో జన్మనిచ్చేటందుకు ఒక్కగడియైనా ఆలోచించక
కుప్పతొట్టి పాల్జేసిన ఆ కాటిన్యహౄదయాల పాపం అది.
కాని కావాలిరా! నీవు దేశానికి దీపం.
No comments:
Post a Comment